Wed Mar 25 2026 05:06:20 GMT+0530 (India Standard Time)
పొన్నాల కోసం ప్రొఫెసర్...?

కోదండరామ్ జనగామ ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అది బీసీ స్థానం కావడంతో తాను పోటీ చేయడం బాగుండదని ఆయన బరిలో నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. జనగామ టిక్కెట్ తెలంగాణ జనసమితికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్న వార్తలు వచ్చాయి. ఇక్కడ మాజీ పీసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీకి దిగడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో పొన్నాల పేరు లేకపోవడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో పొన్నాల పార్టీ పెద్దలతో మంతనాలు జరపుతున్న సమయంలోనే ఇక్కడ కోదండరామ్ తాను జనగామ అసెంబ్లీకి పోటీ చేయబోనని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

