Tue Mar 24 2026 10:40:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ పై దాడి కేసులో వైసీపీ నేతకు నోటీసులు

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత టీడీపీపై ఆరోపణలు చేసినందుకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలే జగన్ పై దాడి చేసి ఉంటారని జోగి రమేష్ అనుమానించారు. అయితే, ఆధారాలు లేకుండా టీడీపీ కార్యకర్తలపై జోగి రమేష్ ఎలా ఆరోపణలు చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని రమేష్ కు నోటీసులు ఇచ్చారు. అయితే, తమపై కేసులు నమోదు చేస్తున్నట్లుగానే ఘటన జరగగానే చేసింది జగన్ అభిమాని ఆని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story

