Fri Mar 27 2026 07:20:18 GMT+0530 (India Standard Time)
జానీ.. అది రెక్కీ కాదట.. తాగుబోతుల గొడవ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఎటువంటి రెక్కీ జరగలేదని పోలీసులు ధృవీకరించారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఎటువంటి రెక్కీ జరగలేదని పోలీసులు ధృవీకరించారు. ముగ్గురు యువకులు పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు వచ్చి కారు ఆపారని పోలీసులు తెలిపారు. కారు తీయమని అడిగిన పవన్ కల్యాణ్ సెక్యూరిటీ కోరగా యువకులు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల విచారణలో ఈ విషయం స్పష్టమయింది. పవన్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ జరగలేదని, దాడి కుట్ర జరగలేదని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో...
పవన్ కల్యాణ్ సెక్యూరితో గొడవకు దిగిన యువకులు ఆదిత్య, వినోద్, సాయికృష్ణ గా గుర్తించారు. ఇది తాగుబోతుల రగడ తప్ప రెక్కీ కాదని పోలీసులు తమ విచారణలో తేల్చారు. మద్యంమత్తులో ముగ్గురు యువకులు పవన్ సెక్యూరిటీతో గొడవ పడ్డారని పోలీసులు ముందు ఒప్పుకున్నారు. యువకులను విచారించి నోటీసులు ఇచ్చి పంపారు. గత రెండు రోజులుగా పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరిగిందని, రెక్కీ నిర్వహించారని బీజేపీ, టీడీపీలు ఆరోపించాయి. రాజకీయ పార్టీ నేతలు ఖండించారు. పవన్ కు భద్రత పెంచాలని కూడా డిమాండ్ చేశారు.
- Tags
- pawan kalyan
Next Story

