Mon Mar 16 2026 02:04:53 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్
తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే కొందరి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కొండపల్లి ఫారెస్ట్ లో అక్రమ క్వారీ తవ్వకాలపై [more]
తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే కొందరి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కొండపల్లి ఫారెస్ట్ లో అక్రమ క్వారీ తవ్వకాలపై [more]

తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే కొందరి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కొండపల్లి ఫారెస్ట్ లో అక్రమ క్వారీ తవ్వకాలపై తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ నేడు కొండపల్లి ప్రాంతంలో పర్యటించాల్సి ఉంది. అయితే ముందస్తుగా తెలుగుదేశం పార్టీ నేతలు నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, వర్లరామయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని కూడా ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు.
Next Story