Mon Mar 16 2026 12:18:58 GMT+0530 (India Standard Time)
పొత్తే పుట్టి ముంచింది.!

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వికటించిందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన శుక్రవారం పార్లమెంటు ఆవరణలో సోనియా గాంధీని కలిసి తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ నివేదిక అందజేశారు. రానున్న సర్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీపీసీసీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేయాలని కోరారు.
Next Story

