Fri Mar 20 2026 02:59:58 GMT+0530 (India Standard Time)
రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి వ్యాఖ్యలివే

విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని పార్టీలకు అతీతంగా ప్రజలంతా డిమాండ్ చేస్తుండగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ... విశాఖ రైల్వే జోన్ కోసం పరిశీలించాలని విభజన చట్టంలో ఉందని, కాబట్టి పరిశీలిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే కేంద్రం రైల్వే జోన్ విషయంపై కేంద్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునేలా కనపడటం లేదు. కాగా, బీజేపీకే చెందిన ఆ పార్టీ ఎంపీ కంభంపాటి హరిబాబు విశాఖకు రైల్వే జోన్ కచ్చితంగా వస్తుందని చెబుతుండగా, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
Next Story

