Mon Mar 23 2026 00:33:25 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు కాన్వాయ్ అడ్డగింత..!

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఊహించని సంఘటన ఎదురైంది. చంద్రబాబు పర్యటిస్తున్న కాన్వాయ్ ను కవిటి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. తమ గ్రామం మీద నుంచే వెళుతూ తమ బాధల్ని తెలుసుకోవడం లేదని వారు ఆందోళన చేశారు. దీంతో చంద్రబాబు కన్వాయ్ ఆపి ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అయితే, తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో తాము అన్ని సహాయక చర్యలు చేస్తున్నామని వారికి చంద్రబాబు నచ్చజెప్పారు.
Next Story

