Fri Apr 03 2026 07:54:26 GMT+0530 (India Standard Time)
HURRY UP : నేటితో గడువు ముగుస్తోంది !
తొలుత మార్చి 1వ తేదీ నుంచి 31 వరకూ ఈ ఆఫర్ ను ప్రకటించిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ తర్వాత గడువును ఏప్రిల్ 15 వరకూ..

హైదరాబాద్ : త్వరపడండి ! నేటితో గడువు ముగుస్తోంది. తెలంగాణ సర్కార్ ప్రకటించిన పెండింగ్ చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ల ఆఫర్ ముగుస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పెండింగ్ చలాన్ల ఆఫర్ ను ఏప్రిల్ 15వ తేదీ వరకూ పెంచిన విషయం తెలిసిందే. ఆ ఆఫర్ నేటితో ముగుస్తుండగా.. వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను త్వరగా క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రేపట్నుంచి యథావిధిగానే చలాన్లను వసూలు చేయనున్నారు.
తొలుత మార్చి 1వ తేదీ నుంచి 31 వరకూ ఈ ఆఫర్ ను ప్రకటించిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ తర్వాత గడువును ఏప్రిల్ 15 వరకూ పొడిగించారు. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని, వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 60 శాతం వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. టూ వీలర్/ త్రీ వీలర్ వెహికల్స్ పై ఉన్న చలాన్లపై 75 శాతం, ఫోర్ వీలర్ , హెవీ వెహికల్స్ చలాన్లపై 50 శాతం, కరోనా సమయంలో మాస్కు పెట్టుకోని కారణంగా వేసిన కేసులలో 90 శాతం, ఆటోలపై ఉన్న చలాన్లు 70 శాతం డిస్కౌంట్ తో క్లియర్ చేసుకోవచ్చు. నేటి సాయంత్రం వరకే ఆఫర్ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు మరోమారు గుర్తు చేశారు.
Next Story

