Wed Mar 25 2026 20:35:12 GMT+0530 (India Standard Time)
పవన్ పై బాబు పవర్ పంచ్...!!!

పవన్ కల్యాణ్ ను పెద్దగా పట్టించుకోవద్దని, ఆయన తన అన్న చిరంజీవిలాగే పార్టీని అమ్ముకుని వెళతారని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారన్నారు. పవన్ ఊసరవెల్లి రాజీకీయాలు ప్రజలకు అర్థమయిందని చంద్రబాబు అనంతపురం జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, జనసేనలు రెండూ ఒకే తానులో ముక్కలని, వాటిని నమ్మవద్దని సూచించారు. జగన్ కోడికత్తి అంతా ఒక డ్రామా అని, తనపై ఆరోపణలు చేస్తున్న జగన్ కు తన చరిత్ర తెలియదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలనూ గెలుచుకుంటామని చంద్రబాబు ధీమాను వ్యక్తం చేశారు.
Next Story

