Wed Mar 18 2026 20:50:46 GMT+0530 (India Standard Time)
పవన్ తో విడాకులకు కారణం చెప్పేసిన రేణూ

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో విడాకులకు గల కారణాన్ని ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ బయటపెట్టారు. ముందుగా పవన్ కళ్యాణే విడాకులు కావాలని అడిగారని, అందుకే విడాకులు తీసుకున్నామని ఆమె స్పష్టం చేసింది. ఇంతకాలం ఆమె విడాకులకు సంబంధించి ఎటువంటి కారణాన్ని బయటకు చెప్పలేదు. అయితే, తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో ఆమె విడుదల చేసిన ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ విడాకుల ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఇంతకాలం ఇంటి విషయాన్ని బయటపెట్టవద్దన్న కారణంతో స్పందించలేదని, కానీ ఇప్పుడు వేరే ఇంటికి కోడలిగా వెళుతున్నందున ప్రజలకు, అభిమానులకు ఈ విషయం తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపారు.
Next Story

