Mon Feb 02 2026 06:27:17 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కు గాయం..అయినా డోంట్ కేర్...

పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోరాటయాత్రలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాలు బెణికింది. దీంతో ఆయన భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స చేయించుకున్నారు. అయితే, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు వైద్యులు సూచించారు. కానీ, విశ్రాంతి తీసుకోవడానికి పవన్ ఒప్పుకోవడం లేదు. కేవలం ఇవాళ ఒక్క రోజు మాత్రమే విశ్రాంతి తీసుకుని, రేపటి నుంచి పోరాటయాత్రను తిరిగి కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. ఇవాళ ఆయన భీమవరం ఎస్సీ కాలనీలో విద్యార్థుల, దేవాదయ ధర్మాదాయ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.
Next Story

