అవసరమైతే ప్రధానిని కలుస్తా
అవసరమైతే రాజధాని విషయంలో ప్రధాని మోదీని కలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఈరోజు రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. రైతులతో సమావేశమయ్యారు. మంత్రులు [more]
అవసరమైతే రాజధాని విషయంలో ప్రధాని మోదీని కలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఈరోజు రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. రైతులతో సమావేశమయ్యారు. మంత్రులు [more]

అవసరమైతే రాజధాని విషయంలో ప్రధాని మోదీని కలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఈరోజు రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. రైతులతో సమావేశమయ్యారు. మంత్రులు తలోరకంగా మాట్లాడటం వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు. అమరావతి ప్రజారాజధానిగా ఉండాలని ఆయన కోరారు. రాజధానిలో ప్రతి జిల్లాకు విశ్రాంతి భవనాలను నిర్మించాలని పవన్ కల్యాణ్ కోరారు.
గిఫ్ట్ గా చెప్పులు….
పవన్ రాజధాని పర్యటన సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పవన్ అభిమాని ఒకరు ఆయనకు స్వయంగా చెప్పుులు కుట్టి ఇచ్చారు. అభిమాని కోరిక మేరకు పవన్ కల్యాణ్ అదే చెప్పులతో రాజధాని ప్రాంతంలో పర్యటించడం విశేషం.