Thu Mar 19 2026 20:01:27 GMT+0530 (India Standard Time)
సర్జరీ చేయించుకోనున్న పవన్ కళ్యాణ్

టాలీవుడ్ అగ్ర నటుడు , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంద్రలో తన రాజకీయ యాత్రలతో తీరిక లేకుండా ఉండటంతోబాటు, పార్టీ నిర్మాణ కార్యక్రమాలలో కూడా బిజీ గా ఉంటున్నారు.అయితే చాలా సార్లు అతను ప్రజలను కలుసుకునే సమయములో సన్ గ్లాస్సెస్ ధరించడం మాత్రం చర్చనీయాంశం అయ్యింది.
ఐతే ఇటీవల తెలిసిన విషయం ఏంటంటే, జనసేన అధినేతను కంటికి కి సంబంధించిన ఇన్ఫెక్షన్ చాలా రోజులనుండి ఇబ్బందికి గురి చేస్తుండటంతో, హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా, వారు చిన్న సర్జరీ అవసరమని సూచించారట.
పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యాత్ర ముగిసిన తరువాత, ఈ సర్జరీ చేయిచుకోవటానికి సిద్దమైనట్లుగా తెలిసింది.
గతంలో రానా దగ్గుపాటి కూడా ఇలాంటి సర్జరీ చేయించుకున్నారు.
Next Story

