Tue Mar 17 2026 18:19:31 GMT+0530 (India Standard Time)
తెలంగాణ ఎన్నికలపై పవన్ సర్వే... నిజమెంత..?

తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికలపై రేపు ఆయన తన అభిప్రాయం చెబుతానని ప్రకటించారు. అయితే, తెలంగాణ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఓ స్వతంత్ర బృందంతో సర్వే చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆలేరు నుంచి బీఎల్ఎఫ్ తరపున పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు విజయం సాధించనున్నారని ఈ సర్వేలో తేలిందట. ఈ మేరకు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారంలో ఉన్న మోత్కుపల్లికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని ప్రచారం జరుగుతోంది. అయితే, పవన్ సర్వే జరుపుతున్నట్లుగా ఎటువంటి సమాచారం లేదు. పైగా ఆయన ఏపీలో ప్రజా పోరాట యాత్రలతో బీజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన తెలంగాణ రాజకీయాలపై సర్వే చేసే అవకాశం ఉందా అనేది మాత్రం అనుమానమే. గతంలో ఆయన ఎప్పుడు సర్వేలు చేయించిన దాఖలాలు కూడా లేవు.
Next Story

