Mon Mar 23 2026 03:27:06 GMT+0530 (India Standard Time)
పవన్ కు ఆ దమ్ముందా?

లోకేష్ ను విమర్శించడం అర్థరహితమని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పంచాయతీ సర్పంచ్ కు పోటీ చేయలేనిలోకేష్ ను పంచాయతీరాజ్ మంత్రిగా చేశారన్న పవన్ వ్యాఖ్యలను సోమిరెడ్డి తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్నా లోకేష్ కు 19 అవార్డులు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా సోమిరెడ్డి గుర్తు చేశారు. 24 గంటలూ శ్రమిస్తున్న లోకేష్ ను అనడానికి నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. జగన్, పవన్ లు మోదీ ప్రేమలో పడ్డారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సభ పెట్టే దమ్ము పవన్ కు ఉందా? అని సోమిరెడ్డి నిలదీశారు. పవన్ మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని, ఆవేశంగా మాట్లాడితే ఓట్లు రాలవని ఆయన అన్నారు.
Next Story

