Thu Mar 19 2026 20:01:26 GMT+0530 (India Standard Time)
పటమటలో పవన్ ఓ ఇంటిని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో గృహ ప్రవేశం చేశారు. సొంత ఇంటి నిర్మాణం అలస్యం అవుతుందని భావించిన పవన్ కల్యాణ్ విజయవాడలోని పటమటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన గృహ ప్రవేశం చేశారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లవుతున్నా పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచే పాలిటిక్స్ నడుపుతున్నారన్న విమర్శలకు చెక్ పెట్టేందుకే విజయవాడలోనే నివాసం ఉండేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, పార్టీ నేతలు హాజరయ్యారు. మొత్తం మీద విజయవాడలో గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ ఇక ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తానని చెప్పారు.
Next Story

