Sun Mar 22 2026 15:29:06 GMT+0530 (India Standard Time)
లోకేష్ పై పవన్ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేష్ పై ఫైరయ్యారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను చంద్రబాబునాయుడు నిర్వీర్యం చేస్తే, లోకేష్ దానిని నిర్జీవం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ ఇక్కడ భూములు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ పాలనను కొనసాగించడమేంటన్నారు. అలాగయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవి నుంచి లోకేష్ ను తప్పించి స్పెషల్ ఆఫీసర్ ను పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. కోట్లు ఉన్నంత మాత్రాన ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని పవన్ అభిప్రాయడపడ్డారు.
Next Story

