రాజధానిపై నిర్మలతో…?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. నిర్మలా సీతారామన్ తో పవన్ కల్యాణ్ దాదాపు గంట సేపు [more]
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. నిర్మలా సీతారామన్ తో పవన్ కల్యాణ్ దాదాపు గంట సేపు [more]

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. నిర్మలా సీతారామన్ తో పవన్ కల్యాణ్ దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితపై చర్చించామని తెలిపారు. రాజధాని అంశంపై నిర్మలా సీతారామన్ తో చర్చించామని చెప్పారు. ప్రభుత్వాలు మారినా పనితీరు మారలేదన్నారు. కే్ంద్ర ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై తాము చర్చించామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. వీటితో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించామని చెప్పారు. పవన్ వెంట నిర్మలను కలసిన వారిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు తదితరులు ఉన్నారు. అమరావతికి సంబంధించి బలమైన కార్యాచరణను ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నట్లు వారికి చెప్పి మూడు రాజధానుల ప్రకటన చేయలేదని పవన్ తెలిపారు.

