Mon Dec 08 2025 13:39:17 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ అలా చేయకుండా ఉండాల్సిందన్న పవన్
రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ఈ సమయంలో సరైన నిర్ణయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వివాదాలు లేని భూములనే [more]
రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ఈ సమయంలో సరైన నిర్ణయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వివాదాలు లేని భూములనే [more]

రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ఈ సమయంలో సరైన నిర్ణయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వివాదాలు లేని భూములనే పేదలకు ఇవ్వాలని పవన్ కోరారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలటూ రైతులందరూ ఒక పక్క ఆందోళన చేస్తుంటే మరోవైపు అదే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అర్థమేంటని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికే ప్రభుత్వం ఈ చర్యకు దిగిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల చట్టపరమైన చిక్కులు మరిన్ని ఎక్కువవుతాయని పవన్ అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడం పట్ల ఎవరూ తప్పుపట్టరని, కానీ వివాదం ఉన్న చోట ఇస్తే అభ్యంతరం ఎందుకు చెప్పకూడదని ప్రశ్నించారు.
Next Story

