Wed Mar 18 2026 05:10:17 GMT+0530 (India Standard Time)
అక్కడ జనసేన బాధ్యులు వీరే
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించారు. జిల్లాల కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు, విజయవాడ నగర [more]
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించారు. జిల్లాల కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు, విజయవాడ నగర [more]

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించారు. జిల్లాల కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు, విజయవాడ నగర కమిటీలను పవన్ కల్యాణ్ నియమించారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షులుగా పోతిన మహేష్, నెల్లూరుకు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిలను నియమించారు. ఈమేరకు పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు నగర కమిటీ కార్యవర్గాన్ని కూడా పవన్ కల్యాణ్ నియామకం చేశారు. దీంతో జనసేన పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది.
Next Story