Mon Mar 16 2026 03:57:08 GMT+0530 (India Standard Time)
షర్మిల పార్టీపై పవన్ స్పందన ఇదే
వైఎస్ షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని పవన్ కల్యాణ్ [more]
వైఎస్ షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని పవన్ కల్యాణ్ [more]

వైఎస్ షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరు వచ్చినా ఆహ్వానించాల్సిందేనన్నారు. తాను 2007 నుంచి రాజకీయాల్లో ఉన్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమగడ్డ అని, కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రావాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణం చాలా కష్టమని అన్నారు. రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వారు కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.
Next Story