Wed Dec 17 2025 14:23:09 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీని నడపటం ఆషామాషీ కాదు
పార్టీ నడపటం అంటే ఆషామాషీ కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన విజయవాడలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. కరోనాతో చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు [more]
పార్టీ నడపటం అంటే ఆషామాషీ కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన విజయవాడలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. కరోనాతో చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు [more]

పార్టీ నడపటం అంటే ఆషామాషీ కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన విజయవాడలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. కరోనాతో చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయాన్ని అందించారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణమని చెప్పారు. కార్యకర్తల అండదండలతోనే తాను పార్టీని ముందుకు తీసుకెళుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా కారణంగా జనసేన కార్యకర్తలను కోల్పోవడం బాధ కల్గించిందన్నారు. జనసైనికులందరికీ బీమా సౌక్యం కల్పించామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పార్టీని కార్యకర్తలే నడుపుతున్నారని పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.
Next Story