Thu Dec 18 2025 05:36:10 GMT+0000 (Coordinated Universal Time)
రత్నప్రభను గెలిపించండి… పవన్ పిలుపు
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ , జనసేన అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ప్రజలకు [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ , జనసేన అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ప్రజలకు [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ , జనసేన అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తేగలిగిన సత్తా రత్నప్రభకే ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తిరుపతి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే రత్నప్రభతోనే సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ తన లేఖలో వివరించారు. రత్నప్రభ ఐఏఎస్ అధికారిగా పనిచేయడంతో ఆమెకు ప్రజల సమస్యలు తెలుసునన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు వారి పార్టీ పెద్దల సేవలోనే తరిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని రత్నప్రభను గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Next Story

