Sun Mar 29 2026 18:24:16 GMT+0530 (India Standard Time)
రైతుల కోసం పోరాడతా
నివార్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఉయ్యూరులో తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. [more]
నివార్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఉయ్యూరులో తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. [more]

నివార్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఉయ్యూరులో తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. ఎకరాకు వేల రూపాయలు ఖర్చు పెట్టిన తాము తీవ్రంగా తుపాను కారణంగా నష్టపోయామని రైతులు పవన్ కల్యాణ్ ఎదుట విలపించారు. అన్నంపెట్టే రైతు విలపిస్తే అది రాష్ట్రానికి మంచిది కాదని పవన్ కల్యాణ్ తెలిపారు. రైతులకు అండగా ఉండేందుకే తాను ఇక్కడకు వచ్చానన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని పవన్ కల్యాణ్ రైతాంగానికి హామీ ఇచ్చారు.
Next Story