Mon Feb 02 2026 23:06:47 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఫ్యాన్స్ ఇంతేనా?

పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఆయన ఫ్యాన్సే..బలమూ...బలహీనత. ఆయన ఎక్కడ పర్యటించినా అభిమానులతో పవన్ ఇబ్బందులు పడక తప్పడం లేదు. పవన్ కల్యాణ్ కర్నూలు జల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో పేలుడు సంభవించి పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితేఈరోజు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పవన్ కల్యాణ్ ఈరోజు పరిశీలించడానికి వెళ్లారు. బాధితులను పరామర్శించాలనుకున్నారు. కాని పవన్ అభిమానులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు. పవన్ ను కదలనీయకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. పవన్ అభిమానులను పోలీసులు సయితం నియంత్రించలేకపోయారు. దీంతో పోలీసులు పేలుడు కు పగుళ్లు ఇచ్చిన ఇళ్లను పరిశీలించడానికి వెళ్లేందుకు పవన్ కు అనుమతి ఇవ్వలేదు. పవన్ అభిమానులను నియంత్రించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
Next Story
