Sun Mar 22 2026 02:39:55 GMT+0530 (India Standard Time)
పవన్ సభకు హాజరైతే రూ.50 వేల జరిమానా

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఈరోజు కొల్లేరు లంకవాసులతో సమావేశాన్నిఏర్పాటు చేసుకున్నారు. వారి సమస్యలను వినేందుకు పవన్ సిద్ధమయ్యారు. అయితే కొల్లేరు లంక వాసులు ఎవరూ పవన్ సభకు హాజరుకాకూడదని గ్రామాల్లో కొందరు దండోరా వేయించడం సంచలనం రేపుతోంది. పవన్ సభలకు హాజరయితే యాభై వేలు జరిమానా విధిస్తామని దండోరా ద్వారా తెలిపారు. మరి లంకవాసులు పవన్ సభకు ఎంతమంది హాజరవుతారనేది చూడాల్సి ఉంది.
Next Story

