Mon Mar 23 2026 10:31:50 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గవర్నర్ తో పవన్ భేటీ

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం కలిశారు. ఇటీవల తిత్లీ తుపాను దెబ్బకు అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. పెద్దయెత్తున జీడితోటలు, అరటితోటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధితలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తిత్లీ తుపానుకు దెబ్బతిన్న శ్రీకాకుళంజిల్లాను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా పవన్ గవర్నర్ ను కోరారు. ముందుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందన్నది పవన్ ప్రధాన ఆరోపణ.
Next Story

