Thu Jan 29 2026 04:08:04 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతలకు పవన్ చెప్పులతో వార్నింగ్
జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు పవన్ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు

జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు పవన్ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. తనకు ప్యాకేజీ పవన్ అని ఎగతాళి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్యాకేజీ అన్న వారిని చెప్పుతో కొడతానని ఆయన హెచ్చరించారు. నుంచో బెట్టి తోలు వలుస్తా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లించానని అన్నారు. వెధవల్లారా? సన్నాసుల్లారా? అంటూ ఫైర్ అయ్యారు.
తోలు తీస్తా...
తాను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తానని చెప్పారు. ఒక్క చేత్తో గొంతు పిసికి చంపేస్తా అని హెచ్చరించారు. యుద్ధానికి ఈరోజు నుంచి తాను సిద్ధమని ప్రకటించారు. తోలు తీస్తానని ప్రకటించారు. నాలో ఇన్నాళ్లు మంచితనం చూశారని, ఇకపై చూస్తార్రా అంటూ పవన్ రెచ్చిపోయి ప్రసంగించారు. అరేయ్ వెధవల్లారా? నా సంపాదన ఎంతో తెలుసా? అని ప్రశ్నించారు. లెక్కలతో సహా వివరించారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, మీరు ఒక పెళ్లి చేసుకుని 30 స్టెప్టీలతో ఉంటారని పవన్ ఫైర్ అయ్యారు. తన గుండె చప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలయిందన్నారు.
బయటకు లాక్కొచ్చి కొడతా...
నేను బాపట్లలో ఉప్పు కారం తిన్నానని, చీరాలలో పెరిగానని, ఒంగోలు గోపాలపురం మామూలు స్కూలులో చదివానని పవన్ అన్నారు. తన పిల్లల పేరుతో డిపాజిట్ చేసిన డబ్బుతో పార్టీ కార్యాలయాన్ని కట్టానని పవన్ తెలిపారు. తనపై విమర్శలు చేసిన ఒక్కొక్కరినీ చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చారు. తాను ఈ మధ్య కాలంలో ఎనిమిది సినిమాలు చేశానని, వంద నుంచి 120 కోట్లు సంపాదించానని చెప్పుకొచ్చారు. 33.37 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించానని తెలిపారు. ఇప్పటి వరకూ తనలో సహనం మాత్రమే చూశారని, ఇకపై ఇళ్లల్లో నుంచి బయటకు లాక్కొచ్చి కొడతానని పవన్ తెలిపారు.
Next Story

