ఏడుకొండలకు తప్ప అన్నింటికీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. జగన్ రెడ్డికి కులం, మతం తప్ప మరొకటి కనపడదని ఎద్దేవా చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. జగన్ రెడ్డికి కులం, మతం తప్ప మరొకటి కనపడదని ఎద్దేవా చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. జగన్ రెడ్డికి కులం, మతం తప్ప మరొకటి కనపడదని ఎద్దేవా చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన పనులన్నింటికీ విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం వెళుతుందని పవన్ చెప్పారు. తిరుపతిలో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఏడు కొండలకు తప్ప అన్నింటికీ పార్టీ రంగులు పూసేశారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రత్యర్థుల చెట్టును నరకడమే జగన్ పనిగా పెట్టుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాసమస్యలపై జనసేన నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. 151 సీట్లు ఇచ్చి ప్రయోజనం ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.