Fri Jan 30 2026 05:44:27 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పర్యటనలో అపశృతి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా పర్యటనలో అపశృతి దొర్లింది. ఆయన పర్యటన కోసం పాయకరావుపేటలోని సూర్యమహాల్ సెంటర్ లో 30 అడుగుల పవన్ ఫ్లేక్సీని కట్టేందుకు ఆయన అభిమానులు శివ, నాగరాజు ప్రయత్నిస్తుండగా ఫ్లేక్సీ విద్యుత్ తీగలకు తగలడంతో ఇద్దరికీ కరెంటు షాక్ వచ్చింది. దీంతో ఇరువురూ అక్కడికక్కడే మరణించారు. మృతులు పాయకరావుపేట, తుని వాసులుగా గుర్తించారు.
Next Story

