Thu Mar 19 2026 18:22:25 GMT+0530 (India Standard Time)
పవన్ కళ్యాణ్ తో మాజీ స్పీకర్ భేటీ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై ఆయన పవన్ కళ్యాణ్ తో చర్చించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు, ప్రస్తుత రాజకీయ పరిస్థితి, విభజన హామీలపై వారు చర్చించినట్లు తెలుస్తుంది. మూడు రోజుల క్రితం ఏపీ నేతలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఏర్పాటుచేసిన సమావేశంలో నాదెండ్ల పాల్గొన్నారు. అయితే, కొంత కాలంగా రాజకీయాల్లో చురుగ్గా లేని ఆయన పార్టీ జనసేన లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది.
Next Story

