జగన్ కు పవన్ డెడ్ లైన్
భవననిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి రెండు వారాలు సమయం ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరికి యాభైవేలు, ఆత్మహత్య చేసుకున్న [more]
భవననిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి రెండు వారాలు సమయం ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరికి యాభైవేలు, ఆత్మహత్య చేసుకున్న [more]

భవననిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి రెండు వారాలు సమయం ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరికి యాభైవేలు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. లేకుంటే అమరావతిలోనే కూర్చుంటానని, పోలీసులతో తనను అడ్డుకోవచ్చని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. కూల్చివేతలను మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోతుందని పవన్ కల్యాణ్ శాపం పెట్టారు. ప్రతి శుక్రవారం సీఎం కోర్టుకు వెళితే బాగుంటుందా? అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసునన్నారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలసి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను చెబుతానన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల కోసం అన్ని పార్టీలూ కలసి వచ్చాయన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కులాలు, వర్గాలతో ఉండటం సిగ్గుచేటన్నారు. రెండు వారాల తర్వాత ఏం చేయాలన్నది అఖిలపక్షంతో కూర్చుని చర్చిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

