Mon Mar 23 2026 00:33:25 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ లోని వారంతా వస్తామన్నారు

తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై నాలుగు రోజుల్లో నిర్ణయి తీసుకుంటామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2009లో తాను తెలంగాణలో అన్ని ఊర్లు పర్యటించానని, తాను ప్రోత్సహించిన వారు చాలామంది టీఆర్ఎస్ లో బలమైన నాయకులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు 2019లో వచ్చి ఉంటే 25 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉండేదని టీఆర్ఎస్ లో నేను ప్రొత్సహించిన వారంతా జనసేన నుంచి పోటీ చేస్తామన్నారని ఆయన పేర్కొన్నారు. కానీ, ఎన్నికలు ముందే రావడంతో ఎలాంటి వైఖరి అవలంభించాలనేది ఆలోచిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
Next Story

