Sun Mar 22 2026 08:49:17 GMT+0530 (India Standard Time)
అలా అయితే జగన్ సీఎం అయ్యేవారు

ముఖ్యమంత్రి కావాలంటే డబ్బు ముఖ్యం కాదని, ఒకవేళ డబ్బే ముఖ్యమైతే జగన్ ఎప్పుడో సీఎం అయ్యేవారని, అంబానీ పీఎం అయ్యి ఉండేవారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ...ప్రజల గుండెల్లో ప్రేమే ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు అనుభవంపై తనకు నమ్మకం ఉన్నందునే గత ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చానని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు తాను అండగా ఉంటానని, వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

