Mon Mar 23 2026 00:33:25 GMT+0530 (India Standard Time)
ఐటీ దాడులపై పవన్ కీలక వ్యాఖ్యలు

పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించిందో అర్థం కావడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒకవేళ ఢిల్లీలో జరిగినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో, సచివాలయంలో ఐటీ దాడులు జరిగితే తాము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి స్పందించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు అందరం కలిసి ఢిల్లీ వెళ్లి మోదీని కలవాలన్నారు. బీజేపీ వారిని వెనకేసుకుని రావాల్సిన అవసరం తనకు లేదని మోదీ, అమిత్ షా తన బంధువులు కాదని ఆయన పేర్కొన్నారు.
Next Story

