Mon Dec 08 2025 17:22:42 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!

రానున్న ఎన్నికల్లో పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ప్రవాసులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ బలం ఇప్పుడు పోయిందని, ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే కలిసే అవకాశం ఉండేదేమో కానీ ఇప్పుడు బీజేపీతో కలవడం ఆత్మవంచనే అవుతుందని పేర్కొన్నారు. తమతో కలిసి వచ్చే సీపీఐ, సీపీఎంలతో కలిసి ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఆనందకరమన్నారు. గతసారి కొన్ని ప్రభుత్వ పథకాలు అందరికీ చేరలేదని, అటువంటి లోపాలు ఈసారి సరిచేసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Next Story

