Sat Mar 28 2026 12:48:12 GMT+0530 (India Standard Time)
పవన్ ఆయన పేరు చెప్పి మరీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఇంగ్లీష్ మీడియంపై ఫైరయ్యారు. ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలుగు భాష అభివృద్ధి కోసం [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఇంగ్లీష్ మీడియంపై ఫైరయ్యారు. ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలుగు భాష అభివృద్ధి కోసం [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఇంగ్లీష్ మీడియంపై ఫైరయ్యారు. ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలుగు భాష అభివృద్ధి కోసం నిధులు తీసుకుని దానికి ఇంగ్లీష్ మీడియం కోసం ఖర్చుపెట్టడమేంటని ప్రశ్నించారు. ఈ సందర్బంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటు లో చేసిన ప్రసంగాన్ని ట్విట్టర్ లో జత చేశారు. జగన్ రెడ్డిగారూ ఇప్పటికైనా మీ నిర్ణయం వెనక్కు తీసుకోమని పవన్ కల్యాణ్ సూచించారు. ఇంగ్లీష్ మీడియంకు తాము వ్యతిరేకం కాదని, అలాగని తెలుగుభాషను అంతం చేస్తుంటే ఊరుకోబోమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఆ ఎంపీ మాటలు విన్న వారికెవరికైనా ఇలాగే అనిపిస్తుందన్నారు.
Next Story