Fri May 03 2024 02:46:07 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన పవన్
తనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోరాటయాత్రలో ఉన్న ఆయన జగన్ వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడుతూ... తాను బలమైన వ్యక్తిని కాబట్టే జగన్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తాను మార్పు కోసం పనిచేస్తున్నందునే తనపై జగన్ తో పాటు ఇతర పార్టీలు సైతం విమర్శిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారికే అంతుంటే నిజాయితీపరుడినైన తనకు ఎంత ఉండాలని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.
Next Story