Sun Feb 01 2026 22:54:46 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు

పార్టీ కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీ పడిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారని, ఏపీ ప్రజల మనస్సు గెలిచే సువర్ణావకాశాన్ని టీడీపీ కోల్పోయిందన్నారు. అవిశ్వాసపై ఆ పార్టీ వాదన లోక్సభలో బలహీనంగా ఉందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీడీపీ ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచిందని విమర్శించారు. దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకి కేంద్రం మనల్ని వంచించిందని తెలియడానికి అన్ని ఏళ్లు పట్టిందంటే మేము నమ్మాలా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Next Story

