Mon Mar 23 2026 10:31:50 GMT+0530 (India Standard Time)
హైకోర్టు తీర్పుపై పవన్ స్పందన

ఆంధ్రప్రదేశ్ లో మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఇచ్చిన హైకోర్టు ఆదేశాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పంజాయితీరాజ్ చట్టాన్ని నవ్వులపాలు చేసేలా ఉన్న జీవో నెం 90ని హైకోర్టు రద్దు చేయడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల అధికారాలు నిలబెట్టేలా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు.
Next Story

