Mon Mar 23 2026 21:05:53 GMT+0530 (India Standard Time)
ట్వీట్ కు ట్వీట్ తోనే సమాధానం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్లపై స్పందించారు. లోకేష్ తో పాటు అతని స్నేహితులు ఆరునెలలుగా తనపై వివిధ ఛానెళ్ల ద్వారా దాడి చేయిస్తున్నారని, తనపై కుట్ర పన్నారని నిన్న పవన్ వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు తనను బాధించాయని, తాను సంస్కారం లేని వ్యక్తిని కాదని లోకేష్ ట్వీట్ చేశారు. గతంలో కూడా పవన్ కల్యాణ్ తనపై అవినీతి ఆరోపణలు చేశారని, అయితే ఆ తర్వాత ఎవరో చెబితే తాను ఆ వ్యాఖ్యలు చేశానని పవన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేశారు. మీ ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని, పవన్ పట్ల తన హృదయంలో ఎప్పటికీ గౌరవప్రదమైన స్థానమే ఉంటుందని లోకేష్ ట్వీట్ చేశారు.
Next Story

