పవర్ స్టార్ కి అండగా ...!

మెగా కుటుంబంలో వివాదాలంటూ గతంలో వచ్చిన వార్తలను కొట్టిపారేసేలా పవన్ వెంట కుటుంబం మొత్తం నిలబడింది. పవన్ కాంట్రవర్సి లో రాంగోపాల్ వర్మ ఏదైనా మంచి చేశారు అంటే పవన్ ఫ్యామిలీ మొత్తం ఒకటిగా చేయడమేనని మెగా కుటుంబ అభిమానులు భావిస్తున్నారు. నిన్నమొన్నటివరకు బన్నీ, రాంచరణ్, వంటివారికి దూరంగానే పవన్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగేది. వారి ఆడియో వీడియో ఫంక్షన్లకు పవన్ హాజరు కావడం తక్కువే. ఆ సభల్లో ఎవరు మాట్లాడుతున్నా పవర్ స్టార్ అంటూ అభిమానులు నానా గోలా చేసేవారు. పలుసందర్భాల్లో పవన్ ఫ్యాన్స్ పై బన్నీ, నాగబాబు సైతం విరుచుకుపడేవారు. అదుపు చేయలేనంత మంది అభిమానులు పవన్ కి ఉండటంతో ఈ ఆడియో ఫంక్షన్లకు పవన్ వెళ్లేవారు. కాదు. దాంతో మెగా, అల్లు కుటుంబాల్లోని కొందరితో పవన్ కి పడదనే ప్రచారం సాగిపోయేది. అభిమానులు సైతం అలాంటి వార్తలు నిజం అనే భ్రమల్లో ఉండేవారు.
నా పేరు సూర్యా లో చెలరేగిన నాగబాబు,...
త్వరలో విడుదల కాబోతున్న నా పేరు సూర్య సినిమా ఫంక్షన్ లో పవన్ సోదరుడు నాగబాబు ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లోకి పవన్ రాకూడదని కొందరు కుట్రలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఒక్కొక్కరి తాట తీసేందుకు దుమ్ము రేపుతూ రాబోతున్నట్లు ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు నాగబాబు. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో కొన్ని తప్పులు చేశామని ఈసారి అలా ఉండదని అన్నారు. తామంతా విడిగా ఉన్నారని భావిస్తే పొరపాటని చెప్పుకొచ్చారు.
మావయ్యకు అండగా బన్ని....
మీకు సేవ చేసేందుకు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ విడిచి వచ్చారని అలాంటి వ్యక్తిపై బురద జల్లే ప్రక్రియ మొదలు పెట్టేశారన్నారు. ఒక్కొక్కరి తాట తీస్తామని హెచ్చరించారు. పవన్ కి సహాయంగా ఎప్పుడు ఉంటామని మరిచిపోవొద్దని పేర్కొన్నారు అల్లు అర్జున్. దాంతో నా పేరు సూర్యా చిత్రం కన్నా పవన్ వివాదమే ఆ సభలో హల్చల్ చేసింది.
