Tue Mar 24 2026 13:41:58 GMT+0530 (India Standard Time)
పవన్ పాదయాత్ర ప్రారంభం

విజయవాడలో పవన్ పాదయాత్ర ప్రారంభమయింది. వామపక్ష నేతలతో కలిసి జనసేనాని రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి పాదయాత్రను చేపట్టారు. దాదాపు మూడున్నర కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర చేపట్టే ముందు పవన్ కల్యాణ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లెఫ్ట్ పార్టీ నేతలతో కలిసి జాతీయ రహదారిపై పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను త్వరగా ముగించాలని, లేకుంటే జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం కష్టమవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు.
Next Story

