Mon Mar 23 2026 17:58:35 GMT+0530 (India Standard Time)
పవన్ కొత్త ట్విస్ట్....టీడీపీకి....?

తనపై ఆరునెలలుగా అమరావతి కేంద్రంగా కుట్ర జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వెల్లడించారు. తనపై కుట్ర అమరావతి కేంద్రంగానే జరిగిందని, దీనిపై తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని పవన్ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా టీడీపీపై పవన్ గత కొద్ది రోజులుగా ట్వీట్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. తనపై మీడియా ఛానల్స్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా పవన్ ఖండిస్తూ వస్తున్నారు. వాటిపై న్యాయపోరాటానికి దిగనున్నట్లు పవన్ వెల్లడించారు. ఏపీలో తనపై జరిగిన కుట్రను తెలంగాణ పోలీసులు విచారించాలంటూ పవన్ కల్యాణ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
Next Story

