Thu Mar 19 2026 21:29:33 GMT+0530 (India Standard Time)
అలా చేస్తే ఊరుకోను.... పవన్ వార్నింగ్

ఇకపై రాజధాని అమరావతిలో భూముల జోలికి వస్తే తాను ఊరుకోబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వమే భూకబ్జాదారులకు అండగా నిలబడటం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే అమరావతిలో ఇకపై భూసేకరణ చట్టాన్ని అమలుచేయడానికి ప్రయత్నించారంటే తాను పోరాటానికి దిగి బాధితులకు అండగా నిలబడతానన్నారు. ఈ నెల 23న విజయవాడ రానున్న పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత రైతులతో సమావేశం కానున్నారు. అలాగే నాయీబ్రాహ్మణులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరపణలపై నిజాలను నిగ్గుతేల్చాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
- Tags
- amaravathi
- andhra pradesh
- ap politics
- janasena party
- land pooling
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అమరావతి
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- ట్విట్టర్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భూసేకరణ
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

