Mon Mar 23 2026 14:48:44 GMT+0530 (India Standard Time)
పవన్ కల్యాణ్ పై మూడు సెక్షన్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని మీడియా ఛానళ్లపై పవన్ తప్పుడు ప్రచారం చేశారని, వాటిని చూడవద్దంటూ పిలుపునిచ్చారని, ఛానళ్లలో ప్రసారం కాని వీడియోలను పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారని జర్నలిస్ట్ యూనియన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన బంజారాహిల్స్ పోలీసులు పవన్ కల్యాణ్ పై ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Next Story

