Mon Mar 23 2026 22:38:12 GMT+0530 (India Standard Time)
ఫిలింఛాంబర్లో పవన్...ఎందుకంటే?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న శ్రీరెడ్డి వ్యవహారం, తనను, తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించడాన్ని పవన్ సీరియస్ గా తీసుకున్నారు. శ్రీరెడ్డి ఆరోపణల వెనక వర్మతో పాటు మరికొందరు ఉన్నట్లు పవన్ అనుమానిస్తున్నారు. దీనిపై ఫిలింఛాంబర్ లీడర్లను కలిసి తన నిరసనను వ్యక్తం చేయడానికి పవన్ ఫిలిం ఛాంబర్ కు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ దీనిపై న్యాయపోరాటానికి దిగనున్నట్లు సమాచారం. ఈరోజు పవన్ వరుసగా దీనిపై ట్వీట్లు చేస్తూ తన ఆవేదనను, ఆగ్రహాన్ని బయటపెట్టారు. ఫిలింఛాంబర్ కు నల్లదుస్తుల్లో వచ్చిన పవన్ నిరసన తెలియచేసేందుకే వచ్చారంటున్నారు.
Next Story

