Mon Mar 23 2026 21:05:53 GMT+0530 (India Standard Time)
రేపటి నుంచే పవన్ యుద్ధం ప్రారంభం

ఎనిమిది నెలలుగా తాను టార్గెట్ చేస్తున్నారని, మీడియాపై తాను సుదీర్ఘ న్యాయ పోరాటానికి దిగబోతున్నానని పవన్ ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులతో కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. ఆయన ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు తన తల్లిని కూడా బజారు కీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తొందరపడి దాడులకు దిగొద్దని పవన్ అభిమానులకు సూచించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. కోపం తెప్పించి నిగ్రహంగా ఉండమంటే ఎలా అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు ప్రసారాలు చేస్తే ఊరుకోవాలా? అని అభిమానుల ఎదుట పవన్ వాపోయారు. తనపై దుష్ప్రచారం చేసిన కొన్ని మీడియా సంస్థలపై ఆయన న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సంయమనం పాటించి తనకు మంచి పేరు తీసుకురావాలని అభిమానులను కోరారు.
Next Story

