టీలు, కాఫీలు తాగేందుకే వెళ్లాలా?

చంద్రబాబు పెట్టే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరయినా ప్రయోజనం లేదని, ఎందుకు సమావేశం పెడుతున్నారో ముందు మంత్రులు చేత చెప్పించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబు మనసులో ఏముందో చెప్పాలన్నారు. ఇన్నిసార్లు మాటలు మార్చి ఇప్పుడు అఖిపక్షం పెడితే ఏమవుతుందన్నారు. అఖిలపక్షాన్ని రెండు సంవత్సరాల ముందు పెడితే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. అఖిలపక్షంతో ఏదో జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. రాజకీయ స్వప్రయోజనాల కోసమే అఖిలపక్షం పెడుతున్నారని పవన్ ఆరోపించారు. కొత్త రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం ఉపయోగపడలేదని పవన్ అన్నారు. విరుద్ధ ప్రకటనలతో ప్రజలను గందరగోళంలో పడేశారన్నారు. కాఫీలు, టీలు తాగడానిక అఖిలపక్షానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. హోదా ఉద్యమాన్ని టీడీపీ, వైసీపీ ముందుకు తీసుకెళ్లలేక పోయాయన్నారు. అవిశ్వాస డిమాండ్ జే.ఎఫ్.సి నుంచే మొదలయిందన్నారు. హోదాపై ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించిందన్నారు. జనసేన, సీపీఎం, సీపీఐ చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిందని, ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పవన్ చెప్పారు
