Mon Mar 23 2026 22:37:52 GMT+0530 (India Standard Time)
కుట్ర చేస్తూ దీక్షకు ఆహ్వానిస్తారా?

తనపై కుట్ర చేస్తూ దీక్షకు ఆహ్వానిస్తారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీపై ఫైర్ అయ్యారు. ఏపీ సెక్రటేరియట్ వేదికగా తనపై ఆరు నెలలుగా కుట్ర జరుగుతుందని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ లు గత కొంతకాలంగా తనపై అసత్య ఆరోపణలు చేస్తుంది నిజం కాదా? అని పవన్ ప్రశ్నించారు. తాను గత ఎన్నికల్లో మద్దతిచ్చినందుకు ఇలా తనకు బహుమతి ఇస్తారా? అని పవన్ ప్రశ్నించారు. చివరకు తన తల్లిపై కూడా అసభ్యకరంగా మాట్లాడిస్తారా? అని ప్రశ్నించారు. తెరవెనక కుట్రలు చేసి దీక్షకు ఆహ్వానిస్తారా? అని పవన్ ప్రశ్నించారు. అయితే పవన్ ట్వీట్లపై స్పందించవద్దని తెలుగుదేశంపార్టీ నేతలకు అధినాయకత్వం సూచించింది. దీక్ష సమయంలో ఇటువంటి ట్వీట్లకు స్పందిస్తే దీక్ష పక్కదారి పడుతుందని టీడీపీ అభిప్రాయపడుతుంది.
Next Story

